సీఎం కేసీఆర్ కి అస్వస్థత

సీఎం కేసీఆర్ కి  అస్వస్థత
  • వైద్య నిపుణుల బృందం ఆధ్వర్యంలో జనరల్ చెకప్ పరీక్షలు
  • హుటా హుటిన యశోద ఆస్పత్రికి హరీష్ రావు, కేటీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు కొద్దిసేపటి క్రితం యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకుని ఆయన తనయుడు మంత్రి కేటీఆర్, అల్లుడు, ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావులు హుటాహుటిన యశోద ఆస్పత్రికి వచ్చారు. మంత్రి కేటీఆర్ ఉప్పల్ పర్యటనను హడావుడిగా ముగించుకుని తిరిగొచ్చారు. ఆర్ధిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా తన మామ అయిన కేసీఆర్ యశోద ఆస్పత్రికి వెళ్లిన విషయం తెలిసింది. దీంతో ఆయన అసెంబ్లీ నుంచి నేరుగా యశోద ఆస్పత్రికి వచ్చారు. 
కేసీఆర్ కు జనరల్ చెకప్, ఇతర పరీక్షలు
రెండ్రోజులుగా ఎడమ చేయి లాగుతోందని చెప్పడం.. రెండ్రోజులుగా వీక్ గా కనిపించడంతో వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వచ్చామని సీఎంఓ వైద్యులు డాక్టర్ ఎం.వీ రావు వెల్లడించారు. కేసీఆర్ కు యాంజియోగ్రామ్, జనరల్ చెకప్ జరుగుతోందని డాక్టర్ ఎం.వి.రావు మీడియాతో తెలిపారు. యాంజియో గ్రామ్ టెస్టులో అంతా నార్మల్ అని వచ్చిందని.. గుండె, రక్త నాళాల్లో ఎక్కడా క్లాట్స్ లేవని వెల్లడైందన్నారు. 

 

ఇవి కూడా చదవండి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్