హైందవానికి ఢోకా లేదు.. చినజీయర్‌ తిరునక్షత్ర వేడుకలో కేసీఆర్

హైందవానికి ఢోకా లేదు.. చినజీయర్‌ తిరునక్షత్ర వేడుకలో కేసీఆర్

చినజీయర్​కు అప్పట్లో కారు డ్రైవర్​గా మారిపోయిన: సీఎం

    ఫిబ్రవరిలో యాదాద్రి ప్రధానాలయ ప్రారంభోత్సవం

    అదే సమయంలో మహా సుదర్శనయాగం: కేసీఆర్​

    చినజీయర్‌ తిరునక్షత్ర వేడుకలకు రెండు బస్సుల్లో కుటుంబం, బంధువులతో వెళ్లిన ముఖ్యమంత్రి

హైందవ మతానికి ఢోకా లేదని, ఎప్పటికీ విఘాతం కలుగదని, జీయర్​ స్వామిలాంటివాళ్లు కాపాడుతూనే ఉంటారని సీఎం కేసీఆర్​ అన్నారు. భగవంతుడ్ని పూజించే సంస్కారం తనకు తల్లిదండ్రుల నుంచే వచ్చిందని చెప్పారు. తనది బాల్యవివాహమని, 14వ ఏటే వరంగల్​ జిల్లా చిత్తలూరులో శోభతో వివాహం జరిగిందని తెలిపారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1986–87లో సిద్దిపేటలో చినజీయర్​ బ్రహ్మయజ్ఞాన్ని నిర్వహించారని, ఆ టైంలోనే ఆయన తన ఇంట్లో ఏడు రోజులు బస చేశారని సీఎం గుర్తుచేసుకున్నారు. అప్పుడు చినజీయర్‌‌‌‌‌‌‌‌కు తాను కారు డ్రైవర్​గా మారిపోయానని తెలిపారు. కొందరికి నచ్చినా, నచ్చకపోయినా.. దేవాలయం అనేది కమ్యూనిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. సోమవారం శంషాబాద్‌‌‌‌‌‌‌‌ ముచ్చింతల్‌‌‌‌‌‌‌‌లో  శ్రీమన్నారాయణ రామనుజ చిన జీయర్‌‌‌‌‌‌‌‌ తిరునక్షత్ర ఉత్సవంలో సీఎం పాల్గొని మాట్లాడారు. రెండు బస్సుల్లో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి జీయర్‌‌‌‌‌‌‌‌ ఆశ్రమానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌, శోభ దంపతులు చిన జీయర్‌‌‌‌‌‌‌‌కు పాదాభివందనం చేసి పండ్లు, పూలు సమర్పించారు. స్వామిని సత్కరించారు.

జో దుర్యోదన.. అని ఏ తల్లీ పాడదు

తాను రవీంద్రభారతిలో ఒక సిద్ధాంతి షష్టిపూర్తి కార్యక్రమంలో పల్లకీ మోశానని, అప్పడు అక్కడికి వచ్చిన స్వాములు హైందవ సంప్రదాయం మీద దాడి జరుగుతోందని, కంసుడ్ని పూజించాలనే దుర్మార్గులు బయలుదేరారని ఆందోళన వ్యక్తం చేశారని సీఎం గుర్తుచేసుకున్నారు. గొప్ప భక్తుడైన మాజీ డీజీపీ అరవింద్‌‌‌‌‌‌‌‌రావు కూడా అలానే ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. ‘‘హిందూ మతంలో, భక్తి పరంపరలో ఉండే బలం చాలా మందికి తెలియక ఉత్తగనే గాబరా పడిపోతూ ఉంటారని, మన సంప్రదాయాలకు ఎలాంటి ఢోకా ఉండదని వాళ్లతో నేను చెప్పిన. తల్లి తన చిన్ని పాపాయిని లాలిస్తూ.. ‘జో అచ్యుతానందా జో జో ముకుందా, లాలి పరమానంద రామగోవిందా’ అంటదే తప్ప.. ‘జో దుర్యోదన.. జో కుంభకర్ణ.. జో కంసా’ అని ఏ తల్లి కూడా పాడదు. తన బిడ్డ పెరిగి మంచివాడు కావాలని చనుబాలు తాగిస్తూనే మంచి సందేశాన్ని అందిస్తది. అదే విషయాన్ని వాళ్లతో చెప్పిన. విఘాతం కలిగే సందర్భమే వస్తే జీయర్‌‌‌‌‌‌‌‌ స్వామిలాంటి వాళ్లు కాపాడుతారు అని అన్నాను’’ అని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వివరించారు. సిద్దిపేట మొదటి ఎమ్మెల్యే గురవారెడ్డి హార్డ్‌‌‌‌‌‌‌‌కోర్‌‌‌‌‌‌‌‌ కమ్యూనిస్టు అని, ఆయన తన వృద్ధాప్యంలో దైవ భక్తుడిగా మారి స్వగ్రామం రామంచలో రామాలయం నిర్మించారని సీఎం తెలిపారు.

పెద్ద జీయర్​ విగ్రహ ఏర్పాటులో సేవకుడ్ని

ముచ్చింతల్​లో వికాస తరంగిణి తలపెట్టిన పెద్ద జీయర్‌‌‌‌‌‌‌‌ విగ్రహ ఏర్పాటులో తాను ఒక సేవకుడిగా పనిచేస్తానని సీఎం కేసీఆర్​ చెప్పారు. ‘‘విదేశాల నుంచి వచ్చే నేతలు, అధికారులు నన్ను కలిసినప్పుడల్లా ‘శంషాబాద్‌‌‌‌‌‌‌‌లో పెద్ద విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు.. ఆయన ఎవరు’ అని అడుగుతుంటారు. ఆయన పెద్ద రెవల్యూషనరీ గురువు అని వాళ్లకు చెప్తుంటాను” అని సీఎం అన్నారు. పెద్ద జీయర్‌‌‌‌‌‌‌‌ స్వామి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆశ్రమం ఏర్పాటు చేసుకోవడం ఈ ప్రాంత వాసుల పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.

రామేశ్వర్​రావును పొగడకుండా ఉండలేను

చిన జీయర్‌‌‌‌‌‌‌‌ తిరునక్షత్రాన్ని దర్శించుకోవడంతో 108 ఆలయాలను దర్శించుకున్న పుణ్యం దక్కిందని సీఎం అన్నారు. ఈ అవకాశాన్ని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వాసులకు కల్పించడంలో రామేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు విశేషంగా కృషి చేశారని, ఆయనను పొగడకుండా ఉండలేకపోతున్నానని పేర్కొన్నారు. తిరునక్షత్ర వేడుకలో చినజీయర్​ చేతుల మీదుగా ఒక పండు అందినా భక్తులు మహాప్రసాదంగా స్వీకరిస్తారని, అందుకే పెద్ద ఎత్తున తాను పండ్లు తెచ్చాను తప్ప ఎవరినీ సంతృప్తి పరచడానికి కాదని ఆయన అన్నారు.

ఫిబ్రవరిలో మహాసుదర్శన యాగం

యాదాద్రి ప్రధానాలయ నిర్మాణం పూర్తి కావొచ్చిందని, ఫిబ్రవరిలో ఆలయ ప్రారంభోత్సవంతో పాటు 1008 కుండలాలతో మహా సుదర్శనయాగాన్ని చిన జీయర్‌‌‌‌‌‌‌‌ చేతుల మీదుగా నిర్వహిస్తున్నామని సీఎం ప్రకటించారు. ప్రపంచంలోని వైష్టవ పీఠాల నుంచి పండితులను యాగానికి పిలిపించాలని జీయర్‌‌‌‌‌‌‌‌ స్వామిని కోరారని తెలిపారు. ప్రత్యేక విమానాలు పెట్టి పండితులను యాగానికి రప్పిస్తానని ఆయన అన్నారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలోనే ఈ ఉత్సవం జరుగుతుందని స్పష్టం చేశారు. మహా సుదర్శనయాగంతో పాటు పెద్ద జీయర్‌‌‌‌‌‌‌‌ విగ్రహావిష్కరణను పెద్ద ఉత్సవంగా నిర్వహిస్తామని సీఎం తెలిపారు.

బక్కవాడైనా గట్టివాడు సీఎంపై చినజీయర్ ప్రశంసలు

‘‘సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బక్కవాడైనా గొప్పవాడు.. ధైర్యస్తుడు.. ఆయన సీఎంగా అయిన తర్వాత నన్ను మొదటిసారి కలిసినప్పుడే ఈ విషయం చెప్పా’’ అని చిన జీయర్‌‌‌‌‌‌‌‌  అన్నారు.  యాదగిరిగుట్టను అద్భుతమైన క్షేత్రంగా దేశంలోనే తలమానికంగా తీర్చి దిద్దుతున్నారని కొనియాడారు. ‘‘దేశంలో నరసింహస్వామికి మరెవ్వరూ అలాంటి ఆలయం నిర్మించలేరు అనే స్థాయిలో కేసీఆర్​ పనులు చేయిస్తున్నారు. ఆయన యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. ఎన్నో ఆలయాలను వృద్ధి చేస్తున్నారు” అని చినజీయర్​ ప్రశంసించారు.    రాజకీయ నాయకులు విమర్శలకు భయపడుతారని, మనస్సులో ఎంత భక్తి ఉన్నా బయటికి చెప్పరని, అలాంటిది కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ధైర్యంగా తన భక్తిని బాహాటంగా ప్రకటిస్తారన్నారు. భగవత్​ భక్తికి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఎగ్జాంపుల్‌‌‌‌‌‌‌‌  అని పేర్కొన్నారు. రాజకీయంగా తనకంటూ కొత్త ఒరవడిని సృష్టించిన మహానీయుడు అని కొనియాడారు.  కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు మనవడిపై ఎంతో ప్రేమ ఉంటుందని చెప్పారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి