సీఎం కెసీఆర్ ఆర్టీసీ కార్మికులను మరోసారి గడువు విధించారు. ఆర్టీసీపై క్యాబినెట్ భేటీ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ కార్మికులు, చిరు ఉద్యోగుల పొట్టలు కొట్టే సంస్కృతికి తమది కాదన్నారు. సమ్మెను విరమించుకునేందుకు మరో గడువు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాదు మరో మూడు రోజుల్లో నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి లోపు విధులలో చేరి బేషరతు పత్రాలను సమర్పించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులను తమ బిడ్డలుగానే భావించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని…లేదంటే చేసేది ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. అర్ధం లేని డిమాండ్లతోనే ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సమ్మెకి వెళ్లారన్న సీఎం కేసీఆర్…దేశంలో కూడా ఎక్కడా ఈ పరిస్థితి లేదన్నారు. చట్ట వ్యతిరేకంగా సమ్మెకి వెళ్లారని.. అయినా తమకు కార్మికులఫై ఎలాంటి ద్వేషం లేదన్నారు.
