కార్మికుల మృతికి సీఎం కేసీఆర్ దే బాధ్యత: చాడ

కార్మికుల మృతికి సీఎం కేసీఆర్ దే బాధ్యత: చాడ

నిర్భందాల మధ్య ఆర్టీసీ కార్మికుల సభ జరుపుకుంటున్నామన్నారు  సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి. కార్మికుల మృతికి సీఎం కేసీఆర్ దే బాధ్యత అన్నారు. సకల జన భేరి సభకు  హాజరైన ఆయన… ఆర్టీసీ కార్మికులు మీకు ఓట్లు వేయలేదా…వారి సమస్యలను పరిష్కరించాల్సిన మీది కాదా అని ప్రశ్నించారు. కార్మికులను ప్రభుత్వం మానసికంగా వేధించిందన్నారు. సమ్మెపై కోర్టు సీరియస్ అయినా ఇంకా స్పందించక పోవడం దారుణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర వహించారన్నారు. ప్రజలకు రవాణా ఎంతో అవసరం అని వంద శాతం ఆర్టీసీ బస్సులు ఉండటంతో పాటు…ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. ప్రశ్నించే గొంతుకను అణచివేయలేరన్న చాడ… ఇప్పటికైనా చర్చలకు పిలవాలని లేదంటే సమ్మెను మరింత ఉదృతం చేస్తామన్నారు. కార్మికులకు సరైన న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు చాడ వెంకట్ రెడ్డి.