యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్..

యశోద ఆస్పత్రికి సీఎం  కేసీఆర్..

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు కొద్దిసేపటి క్రితం వైద్య పరీక్షల నిమిత్తం యశోద హాస్పిటల్ కు వెళ్లారు. భార్య, కుమార్తెతో కలసి ఆయన ఆస్పత్రికి వచ్చారు. అస్వస్థతకు గురికావడం వల్లే ఆయన ఇవాళ్టి కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం అయితే యాదాద్రిలో లక్ష్మి నరసింహస్వామి తిరు కళ్యాణోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉంది. అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారు. భార్య, కుమార్తెతో కలసి యశోద ఆస్పత్రికి వచ్చారు.  వైద్యులు కేసీఆర్ కు హార్ట్  యాంజియో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు  సమాచారం. 

రెండ్రోజులుగా ఎడమ చేయి లాగుతోందని చెప్పారు
సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా లేరు.. రెండ్రోజులుగా వీక్ గా ఉన్నారు, ఎడమ చేయి లాగుతున్నట్లు చెప్పారు, ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేస్తామని, జనరల్ చెకప్ లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తామని సీఎంవో వైద్యులు డాక్టర్ ఎం.వి.రావు మీడియాతో చెప్పారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని డా.ఎం.వి.రావు తెలిపారు. 

 

ఇవి కూడా చదవండి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్