GST ప్రతిపాదనలపై మోడీకి సీఎం లేఖ

GST ప్రతిపాదనలపై మోడీకి సీఎం లేఖ

జీఎస్టీ కొత్త ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లెటర్ రాశారు సీఎం కేసీఆర్. కరోనాతో ఆదాయం పడిపోయిందని ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. కరోనాపై పోరాటంతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని ఇలాంటి పరిస్థితిలో కేంద్రం నుంచి మరింత సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. రుణాలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని కేంద్రం మరిచిపోవద్దన్నారు. చట్ట ప్రకారం రెండు నెలలకోసారి ఇవ్వాల్సిన జీఎస్టీ కాంపన్సేషన్ కూడా ఇవ్వడం లేదని.. ఇలాగైతే రాష్ట్రాలు ఎలా మనుగడ సాగిస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రాల సమ్మతి లేకుండా జీఎస్టీ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవే అని.. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ లెటర్ లో పేర్కొన్నారు సీఎం కేసీఆర్.