దండుగ అనుకున్న వ్యవసాయాన్ని కేసీఆర్ పండుగ చేశారు

దండుగ అనుకున్న వ్యవసాయాన్ని కేసీఆర్ పండుగ చేశారు
  • కేసీఆర్ జన్మదినోత్సవాలను ఘనంగా జరుపాలని పిలుపు
  • రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వర్ధన్నపేట: కోట్ల మంది కలయైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటంతో పాటు.. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో  స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అనంతరం రక్తదానం చేసిన కార్యకర్తలకు మంత్రి పండ్లు, గుడ్లు, పాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, వ్యవసాయం గురించి ఆనాటి పాలకులు ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. కానీ కేసీఆర్ వచ్చాకా తెలంగాణ రూపరేఖలే మారిపోయాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణను సస్యశ్యామలం చేశారన్నారు. అలాంటి గొప్ప నాయకుడైన కేసీఆర్ జన్మదినోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

బీజేపీకి ఓటేసి తప్పు చేశాం

మేడారంలో దర్శనానికి రెండుగంటలు..!!