రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజల కోరికలన్నీ నెరవేరాలని ఆకాంక్షించారు. ఏటా వినూత్న పంథాలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అన్ని వర్గాలు ప్రగతిపథంలో పురోగమించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం అన్నారు. 2022లో కష్టాలను అధిగమిస్తూ అకుంఠిత దీక్షతో సుపరిపాలనను కొనసాగిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని అన్నారు.