దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. శనివారం 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌడ్‌లోని అమరవీరుల స్ధూపం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆర్మీ వార్ మెమోరియల్ వద్ద సీఎం పుష్పగుచ్చం సమర్పించి నివాళి అర్పించారు. విజిటర్స్ పుస్తకంలో సంతకం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సైనిక వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, పలువురు సైనికాధికారులు పాల్గొన్నారు.
74వ #స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని ఆర్మీ వార్ మెమోరియల్ వద్ద సీఎం శ్రీ కేసీఆర్ పుష్పగుచ్చం సమర్పించి నివాళి అర్పించారు. విజిటర్స్ పుస్తకంలో సంతకం చేశారు.#IndependenceDayIndia pic.twitter.com/Op8N5YuXsG
— Telangana CMO (@TelanganaCMO) August 15, 2020
