
ప్రఖ్యాత లక్ష్మీనారసింహ క్షేత్రం యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయంలోకి పూర్ణకుంభంతో సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు పూజారులు. దగ్గరుండి స్వామి దర్శనం చేయించారు. బాలాలయంలో స్వామి వారి తీర్థఫ్రసాదాలు ముఖ్యమంత్రికి అందించారు. కేసీఆర్ తో పాటు… మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత గుడి నుంచి బయటకొచ్చిన కేసీఆర్… మంత్రులు, ఆలయ ఆధికారులతో కలిసి.. టెంపుల్ లో కలియదిరిగారు. గుడి అభివృద్ధి పనులను పరిశీలించారు. చేయాల్సిన పనులపై అధికారులకు సూచనలు ఇచ్చారు.