గోదావ‌రి న‌దికి పూజలు చేసి హార‌తిచ్చిన సీఎం కేసీఆర్

గోదావ‌రి న‌దికి పూజలు చేసి హార‌తిచ్చిన సీఎం కేసీఆర్

మంచిర్యాల జిల్లా పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్..  గోదావ‌రిఖ‌ని ప‌ట్టణంలో ఆగారు. గోదావ‌రిఖ‌ని బ్రిడ్జి వ‌ద్ద గోదావ‌రి న‌దికి పూజలు చేసి హారతి ఇచ్చారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల క‌మ‌లాక‌ర్, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, కోరుకంటి చంద‌ర్, దివాక‌ర్ రావుతో పాటు ప‌లువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.  మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా  కొత్త కలెక్టరేట్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను   సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 

మంచిర్యాల సభలో కేసీఆర్ కీలక ప్రకటన 

మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దివ్యాంగులకు పింఛన్‌ను మరో వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించారు.విక‌లాంగుల‌కు వచ్చే నెల నుంచి రూ. 4,116 పెన్షన్ ఇస్తామని వెల్లడించారు. మంచిర్యాల గ‌డ్డ, తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ఈ ప్రకటన చేయాలని తాను దీనిని స‌స్పెన్షన్ లో పెట్టానన్నారు. అంద‌రి సంక్షేమాన్ని, మంచిని చూసుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్  వెల్లడించారు.