
ఆర్టీసీ కార్మికులు అర్థంపర్ధంలేని డిమాండ్లు చేస్తున్నారని పిచ్చి పంథాను ఎంచుకున్నారని తెలిపారు సీఎం కేసీఆర్. గురువారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు కేసీఆర్. ఆర్టీసీని సరైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశ్యంతో బడ్జెట్ లో రూ. లక్షా 84 వేలు కేటాయిస్తే..కార్మికులు మాత్రం పిచ్చిగా వ్యవహారిస్తున్నారన్నారు. ఆర్థిక మాంద్యం కొన్ని రంగాలు కుప్ప కూలాయని ఆ పరిస్థితి మన ఆర్టీసీకి రావద్దన్నారు. ఆర్టీసీ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అన్నారు సీఎం.
తాను గతంలో రవాణాశాఖమంత్రిగా పనిచేశానని..అందుకే దేశంలోనే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జీతాలు ఎక్కువగా పెంచామన్నారు. ఎవరుపడితే వారువచ్చి ప్రభుత్వంలో కలపాలంటే ఏంటి పరిస్థితి..మిగతా 57 కార్పొరేషన్లు అడిగితే ఎంటి పరిస్థితి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అనేది అర్ధంపర్ధంలేని డిమాండ్ అన్నారు. ఎక్కడేంపనిలేక జెండాపట్టుకుని మాట్లాడుతున్నారని..సీఎం అయ్యాక 67శాతం జీతాలు పెంచానని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓ పద్దతి బాధ్యత ఉందన్నారు. ఆర్ధిక పరిస్థితి బాగాలేక ఉంటే..గొంతెమ్మ కోర్కెలా అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీని ఎత్తేశారని గుర్తు చేశారు సీఎం కేసీఆర్.