సిద్దిపేట జిల్లా: తాము చెప్పేది నియంత్రిత సాగు మాత్రమే కానీ.. నియంతృత్వ సాగు కాదు అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. యావత్ దేశమే ఆశ్చర్య పడే వార్త ఒకటి త్వరలో చెప్పబోతున్నానని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ పట్టుబడితే మొండిపట్టు పడుతాడని, రైతులు అద్భుతాలు సృష్టించే రోజులు త్వరలో రాబోతున్నాయన్నారు. తాము ప్రకటించిన నియంత్రిత సాగుకు మద్దతు తెలుపుతూ ఇప్పటికే వేలాది గ్రామాలు తీర్మానం చేశాయన్నారు. నియంత్రిత సాగు మీద వెనక్కి తగ్గేది లేదని, ముందుకే పోతామన్నారు. ముఖ్యమంత్రి బాటే.. మా బాట అని రైతులు తీర్మానాలు చేశారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు
