పంట కొనుగోలుకు రూ.3 వేల 200 కోట్లు

పంట కొనుగోలుకు రూ.3 వేల 200 కోట్లు

మార్కెట్ యార్డుల‌ను తాత్కాలికంగా మూసివేశామ‌ని మొత్తం ధాన్య‌మంతా గ్రామాల్లోనే కొంటామ‌ని తెలిపారు సీఎం కేసీఆర్. లాక్ డైన్ పై ఆదివారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయ‌న‌.. లాక్ డౌన్ దృష్ట్యా మార్కెట్ మూసివేసి ఉంట‌ద‌ని.. రైతులు మార్కెట్ యార్డుకు రావ‌ద్ద‌ని సూచించారు. కూప‌న్ లో ఇచ్చిన తేదీ ప్ర‌కార‌మే పంట‌ను అమ్మ‌కానికి తేవాల‌న్నారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇచ్చి వ‌రి, మొక్క‌జొన్న పంట‌ల‌ను అంతా ప్ర‌భుత్వ‌మే కొంట‌ది ప‌రేషాన్ వ‌ద్ద‌న్నారు.

ఆన్ లైన్ లో డ‌బ్బులు జ‌మ చేస్తామ‌న్న సీఎం..ఇందుకోసం రూ.3వేల 200 కోట్లు మార్కెఫెడ్ ఇచ్చామ‌న్నారు. సర్కారు దగ్గర పైసల్లేవని.. ఉద్యోగులకు జీతాలిస్తామా లేదా అన్నట్లుందన్న కేసీఆర్..అయినా సరే రైతుల కోసం ఇన్ని కోట్లు కేటాయించామ‌ని చెప్పారు. అర్ధం చేసుకొని క్రమశిక్షణ పాటిస్తూ కరోనా కట్టడికి కృషి చెయ్యాలని తెలిపారు సీఎం కేసీఆర్.