ప్రజాస్వామ్య హత్య దేశ పునాదులకే ప్రమాదం: కేసీఆర్

ప్రజాస్వామ్య హత్య  దేశ పునాదులకే ప్రమాదం: కేసీఆర్

మునుగోడు ఎన్నికలో అసత్య ప్రచారాలు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును అందరూ గౌరవించాలని చెప్పారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు సంయమనం ఉండాలని.. ఎలక్షన్ కమిషన్ విఫలమైందని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రతి పక్షాలను గెలిపిస్తే ఎలక్షన్ కమిషన్ పాస్ అయినట్టా అని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులను విమర్శించే సంస్కారం ఎక్కడిదని ప్రశ్నించారు. పాల్వాయి స్రవంతి తనను కలిసినట్లు తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముందన్నారు. 

దేశ పునాదికి ప్రమాదం కలిగే పరిస్థితి ఏర్పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని విచ్చలవిడిగా హత్య చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రూపాయి విలువ పడిపోయింది.. నిరుద్యోగులు అల్లడిపోతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని  అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు జోడించి వేడుకుంటున్నా.. హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయవాదులు దేశాన్ని కాపాడండి అంటూ కేసీఆర్ వేడుకున్నారు.