
ప్రధాని దీపం పెట్టాలని పిలుపిస్తే దాని మీద జోకులేసి.. అవహేళన చేస్తరా? అది ఒక సంఘీభావ సంకేతం. కష్ట సమయంలో మేమంతా ఒక్కటిగా ఉన్నామని మనోస ్థైర్యాన్ని, జాతి ఐక్యతను చాటి చెప్పే చర్యలు ఇవి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి వంద పిలుపులు ఇచ్చిన. సమస్య మీద సామూహిక యుద్ధం చేయాలె. ప్రధాని అంటే ఒక ఇనిస్ట్యూషన్ .. అందులో వ్యక్తిగత ఇంట్రస్ట్ ఉండదు. దాన్ని కూడా తప్పుగా మాట్లాడిన వాళ్లు కుసంస్కారులు, దుర్మార్గులు. అట్లాంటి చిల్లరగాళ్లు చేసే పిచ్చి ప్రచారాలను నమ్మొద్దు . లాక్ డౌన్ కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఏ నిర్ణయమైనా నలుగురితో కలిసే ఉంటుంది. మన రాష్ట్రమేం స్వతంత్ర దేశం కాదు. కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో కలిసే నడవాల్సి ఉంటది.