గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్..స్పేస్‌ఎక్స్కు ప్రత్యామ్నాయాల వేటలో ట్రంప్

గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్..స్పేస్‌ఎక్స్కు ప్రత్యామ్నాయాల వేటలో ట్రంప్

గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించడానికి భాగస్వాముల కోసం ట్రంప్ పరిపాలన అన్వేషణను విస్తరిస్తోంది.Amazon.com ప్రాజెక్ట్ కైపర్, పెద్ద పెద్ద డిఫెన్స్ కాంట్రాక్టర్లను ఆశ్రయిస్తోంది. ఎలోన్ మస్క్‌తో విభేదాల క్రమంలో గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో SpaceX ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు యూఎస్ సైనిక కమ్యూనికేషన్లకు కేంద్రంగా ఉన్న స్టార్‌లింక్ ,స్టార్‌షీల్డ్ ఉపగ్రహ నెట్‌వర్క్‌లు, మస్క్ స్పేస్‌ఎక్స్‌పై ఆధారపడటం నుంచి వ్యూహాత్మక మలుపును సూచిస్తుంది.  

జూన్ 5 తర్వాత ట్రంప్, మస్క్ మధ్య బహిరంగ విభేదాలతో వారి మధ్య సంబంధాలు క్షీణిచండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపించినప్పటికీ ఈ వివాదం జరగడానికి ముందే   పెంటగాన్ ,వైట్ హౌస్ అధికారులు స్పేస్‌ఎక్స్‌కు ప్రత్యామ్నాయాలను అన్వేషించడం ప్రారంభించారని తెలుస్తోంది. 175 బిలియన్ల డాలర్ల అంతరిక్ష ఆధారిత రక్షణ కవచంలో ప్రధాన భాగాలను ఒకే పార్టినర్ కు ఇచ్చి వారి అతిగా ఆధారపడటం మంచిది కాదని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

స్పేస్ ఎక్స్  దాదాపు 9వేల కంటే ఎక్కువ సొంత స్టార్ లింక్ శాటిలైట్లనను ప్రయోగించిన ట్రాక్ రికార్డు ఉంది. ఇది గోల్డెన్ డోమ్ ప్రధాని భాగాలకు, ముఖ్యంగా కాంట్రాక్టులను ప్రయోగించడానికి అంతర్గత ట్రాక్ ను కలిగి ఉంది. 

అయితే స్పేస్ ఎక్స్ ను కాదని 3వేల తక్కువ-భూమి కక్ష్య ఉపగ్రహాల ప్రణాళికలో 78 మాత్రమే ప్రయోగించిన ప్రాజెక్ట్ కైపర్ ను ట్రంప్ సంప్రదించడం ఇది వాణిజ్య జాతీయ రక్షణ మౌలిక సదుపాయాలను అనుసంధానించేందుకు ఇప్పుడున్న స్పేస్ ఎక్స్ ను పక్కన పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 

గోల్డెన్ డోమ్ అంటే.. 

గోల్డెన్ డోమ్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను పోలి ఉంటుంది. కాకపోతే ఐరన్ డోమ్ కంటే చాలా పెద్దది, సంక్లిష్టమైన రక్షణ వ్యవస్థం. దీనికి  అనేక కక్ష్యా ఉపగ్రహాల నెట్ వర్క్ అవసరం. ఇది ఎక్కువ భూభాగాన్ని కవర్ చేస్తుంది. బాలిస్టిక్, హైపర్‌సోనిక్ ,క్రూయిజ్ క్షిపణులు వంటిమిస్సైళ్లను ప్రయోగానికి ముందే గుర్తించి ధ్వంసం చేయడం గోల్డెన్ డోమ్ లక్ష్యం.

►ALSO READ | పాకిస్తాన్లో పరువు హత్య..పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారని..జంటను దారుణంగా కాల్చి చంపారు

ట్రంప్ రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గెట్లీన్ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించనున్నారు. 

కొత్త పార్టినర్లకోసం వేట.,.

స్పేస్‌ఎక్స్ దాని పరిమాణం, 9వేలకంటే ఎక్కువ స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించిన ట్రాక్ రికార్డ్ ఉంది. గోల్డెన్ డోమ్‌లోని ప్రధాన భాగాలకు ముఖ్యంగా ప్రయోగ ఒప్పందాలకు సహాయం చేసేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమంలో దాని వాటా తగ్గే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.

ట్రంప్ పరిపాలన గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ముందుకెళ్తోంది. మస్క్ తో విభేదాలు, కొత్త రక్షణ సంస్థల ప్రవేశంతో భవిష్యత్తులో అంతరిక్ష ఆధారిత రక్షణ రంగంలో భారీ మార్పులు రానున్నాయి. ఏ కంపెనీలు ఈ కీలకమైన ప్రాజెక్ట్‌లో భాగస్వాములు అవుతాయో, ఈ క్షిపణి కవచం అమెరికా భద్రతకు ఎంత మేరకు దోహదపడుతుందో వేచి చూడాలి.