కాసేపట్లో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కోర్టుకు ఇవ్వాల్సిన రిపోర్టుపై ప్రగతిభవన్‌లో సీఏం కేసీఆర్ అధికారులతో నిర్వహించారు. ఆర్టీసీ సమ్మెపై సోమవారం హైకోర్టులో విచారణ జరగగా.. నిన్నటి విచారణలో ప్రభుత్వాన్ని కోర్టు నివేదిక కోరింది. దీంతో మంగళవారం హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై అడ్వకేట్ జనరల్, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. మరి కాసేపట్లో విచారణ జరగనుండడంతో అటు ఆర్టీసీ కార్మికుల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
