
- ఎవరూ ఊహించనట్టు సంక్షేమానికి పెద్దపీట వేసినం
- పచ్చబడ్డ పాలమూరుపై పాట రాసిన
- ధరణిపై మాట్లాడెటోళ్లను ఉరికించాలని కామెంట్
- నాగర్‌కర్నూల్‌లో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులు ప్రారంభం
- ధరణితో 99% సమస్యలు పరిష్కారమైనయ్
- ప్రజలకు కడుపుల సల్ల కదులనిస్తలేం: కేసీఆర్
నాగర్ కర్నూల్, వెలుగు: ధరణి పోర్టల్‌తో 99 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. అక్కడో ఇక్కడో ఒకటీ రెండు ఉంటే అవీ పరిష్కారమవుతాయని తెలిపారు. ‘‘వాడొకడు వీడోకడు మీటింగులు పెట్టి ధరణిని రద్దు చేస్తం అంటున్నరు. ధరణిని బంగాళఖాతంలో కలుపుతమంటున్నరు. ధరణి వల్ల రైతులకు ఎంతో లాభం కలిగింది. మీ పట్టాలను మార్చే శక్తి ఎవరికీ లేదు. వీఆర్వో నుంచి సీఎం దాక ఎవ్వరూ ఏం చేయలేరు. భూమి అమ్మిన రైతు వేలి ముద్రవేస్తే తప్ప రికార్డు మారదు’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘ఇంత మంచిగ సిస్టమ్ తయారై.. కడుపుల సల్ల కదుల్తలేదు.. వడ్లమ్మితే పైసలు మీ బ్యాంకులకొస్తయ్.. రైతు బంధు పైసలేస్తే మీ బ్యాంకులకొస్తయ్.. రైతు చనిపోతే బీమా పైసలు మీ బ్యాంకులకు వస్తయ్. దీన్ని పోడగొట్టుకుందామా? ధరణితోని 99 శాతం సమస్యలు పరిష్కారమైనయ్” అని తెలిపారు. ఇన్నాళ్లూ ఆగం పట్టిచ్చినోళ్లు మళ్లీ బ్రోకర్లకు, లంచాలకు ప్రజలను బలి చేయడానికి వస్తున్నారని విమర్శించారు. నాగర్‌కర్నూల్‌లో ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులను మంగళవారం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఒక వేళ ధరణి లేకపోతే లక్షలకు కోట్లకు పెరిగిన భూముల ధరలకు ఎన్ని పంచాయితీలైతుంటే.. ఎన్ని పోలీస్ కేసులైతుండే.. ఎన్నిమర్డర్లయితుండే.. ఇవాళ అది లేదు. పల్లెలు ప్రశాంతంగా ఉన్నయ్. పల్లెలు ప్రశాంతంగా ఉండుడు వీళ్లకు ఇష్టం లేదు” అని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘‘మోసపోతే గోసపడ్తరు. ధరణి గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న వాళ్లను ఉరికించి గ్రామాల్లో చర్చ పెట్టాలి” అని అన్నారు.
ఎవరూ ఊహించనట్టు సంక్షేమం
ఎవరూ ఊహించనట్టు పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని, ప్రజల కడుపుల సల్ల కదలకుండా చూసుకుంటున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘కాంగ్రెస్, టీడీపీ 70 ఏండ్లు పాలించినా పాలమూరు ప్రజల గోస పట్టించుకోలే. గంజి కేంద్రాలు పెట్టడంలో పోటీపడ్డారే కానీ.. వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యల గురించి ఆలోచించలేదు. అప్పుడు గంజి కేంద్రాలు నడిచిన పాలమూరులో ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నయ్’’ అని చెప్పారు. తాము పవర్లోకి వచ్చిన తర్వాతే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరిస్తున్నామని, దీంతో పాలమూరు పచ్చబడ్డదని తెలిపారు. పాలమూరు కరవు చూసి ఏడ్చిన తాను పచ్చబడ్డ పాలమూరుపై పాట రాసిన అని కేసీఆర్ చెప్పుకున్నారు. నాగర్ కర్నూల్, వెలుగు: ధరణి పోర్టల్‌తో 99 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. అక్కడో ఇక్కడో ఒకటీ రెండు ఉంటే అవీ పరిష్కారమవుతాయని తెలిపారు. ‘‘వాడొకడు వీడోకడు మీటింగులు పెట్టి ధరణిని రద్దు చేస్తం అంటున్నరు. ధరణిని బంగాళఖాతంలో కలుపుతమంటున్నరు. ధరణి వల్ల రైతులకు ఎంతో లాభం కలిగింది. మీ పట్టాలను మార్చే శక్తి ఎవరికీ లేదు. వీఆర్వో నుంచి సీఎం దాక ఎవ్వరూ ఏం చేయలేరు. భూమి అమ్మిన రైతు వేలి ముద్రవేస్తే తప్ప రికార్డు మారదు’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘ఇంత మంచిగ సిస్టమ్ తయారై.. కడుపుల సల్ల కదుల్తలేదు.. వడ్లమ్మితే పైసలు మీ బ్యాంకులకొస్తయ్.. రైతు బంధు పైసలేస్తే మీ బ్యాంకులకొస్తయ్.. రైతు చనిపోతే బీమా పైసలు మీ బ్యాంకులకు వస్తయ్. దీన్ని పోడగొట్టుకుందామా? ధరణితోని 99 శాతం సమస్యలు పరిష్కారమైనయ్” అని తెలిపారు. ఇన్నాళ్లూ ఆగం పట్టిచ్చినోళ్లు మళ్లీ బ్రోకర్లకు, లంచాలకు ప్రజలను బలి చేయడానికి వస్తున్నారని విమర్శించారు. నాగర్‌కర్నూల్‌లో ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులను మంగళవారం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఒక వేళ ధరణి లేకపోతే లక్షలకు కోట్లకు పెరిగిన భూముల ధరలకు ఎన్ని పంచాయితీలైతుంటే.. ఎన్ని పోలీస్ కేసులైతుండే.. ఎన్నిమర్డర్లయితుండే.. ఇవాళ అది లేదు. పల్లెలు ప్రశాంతంగా ఉన్నయ్. పల్లెలు ప్రశాంతంగా ఉండుడు వీళ్లకు ఇష్టం లేదు” అని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘‘మోసపోతే గోసపడ్తరు. ధరణి గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న వాళ్లను ఉరికించి గ్రామాల్లో చర్చ పెట్టాలి” అని అన్నారు.
ఎవరూ ఊహించనట్టు సంక్షేమం
ఎవరూ ఊహించనట్టు పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని, ప్రజల కడుపుల సల్ల కదలకుండా చూసుకుంటున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘కాంగ్రెస్, టీడీపీ 70 ఏండ్లు పాలించినా పాలమూరు ప్రజల గోస పట్టించుకోలే. గంజి కేంద్రాలు పెట్టడంలో పోటీపడ్డారే కానీ.. వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యల గురించి ఆలోచించలేదు. అప్పుడు గంజి కేంద్రాలు నడిచిన పాలమూరులో ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నయ్’’ అని చెప్పారు. తాము పవర్లోకి వచ్చిన తర్వాతే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరిస్తున్నామని, దీంతో పాలమూరు పచ్చబడ్డదని తెలిపారు. పాలమూరు కరవు చూసి ఏడ్చిన తాను పచ్చబడ్డ పాలమూరుపై పాట రాసిన అని కేసీఆర్ చెప్పుకున్నారు.
జీతాలు పెంచుకుందాం
కొత్త కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులను ప్రారంభించిన కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ మనోహర్‌ను కుర్చీల్లో కూర్చోబెట్టి సీఎం అభినందించారు. ఉద్యోగుల సహకారం వల్లే తెలంగాణ అన్ని రంగాలలో టాప్‌లో ఉందని ఆయన అన్నారు. సంపదను సృష్టించి ప్రజలకు పంచడంతో పాటు జీతాలు పెంచుకుందామని తెలిపారు.