ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తాం

V6 Velugu Posted on Oct 18, 2021

గతేడాది మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పోయిన సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 6545 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సోమవారం ప్రగతిభవన్ లో ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.  సమావేశంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.

యధావిధిగా ఈ ఏడాది కూడా ఆ కేంద్రాలన్నింటీ ద్వారా ధాన్య సేకరణ జరపాలని సీఎం కేసీఆర్ పౌర సరఫరాల శాఖాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం  ప్రకటించారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు  సూచించారు.  మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు జరగడానికి కావలసిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని అన్నారు.

Tagged CM KCR, monsoon season, collect grain

Latest Videos

Subscribe Now

More News