ఈ వానాకాలం పండించిన ప్రతి గింజ కొంటం

ఈ వానాకాలం పండించిన ప్రతి గింజ కొంటం

ఈ వర్షాకాలం చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం కొంటుందన్నారు సీఎం కేసీఆర్. అవసరమైతే మరిన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దన్నారు. ఒక సంవత్సర కాలంలో తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో కేంద్రం స్పష్టంగా  చెప్పాలన్నారు. దీనిని బట్టి ఏఏ పంటలు వేయాలో  తాము రైతులకు చెబుతామన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఇకనైనా ఆలోచించి మాట్లాడాలన్నారు. రైతుచట్టాల విషయంలో బీజేపీ బండారం బయటపడిందన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు   తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తాము అగ్రిచట్టాలకు ఏనాడు మద్దతివ్వలేదన్నారు. పార్లమెంట్ లో కూడా వ్యతిరేకించామన్నారు. తాను ప్రధానిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం చెప్పామన్నారు కేసీఆర్.

కులగణనకు కేంద్రం ఎందుకు ఒప్పుకోవడం లేదన్నారు. కులాల లెక్కలు దాచడం ఎందుకన్నారు.బీసీ గణన చేయకుంటే ఉద్యమాలు జరిగే అవకాశముందన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై తమకు అవకాశము ఇవ్వాలన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని..అయినా చేయడం లేదన్నారు. ఇది పెద్ద వివాదానికి తెరలేస్తదన్నారు. వచ్చే  పార్టమెంట్  లో కులఘణనకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలన్నారు.