ఈడీ,బోడి దాడులకు భయపడం.. ఎవరొస్తారో రాని చూద్దాం

ఈడీ,బోడి దాడులకు భయపడం.. ఎవరొస్తారో రాని చూద్దాం

వడ్లు కొనకుంటే తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం అనంతరం మాట్లాడిన కేసీఆర్.. యాసంగి పంటను పంజాబ్ తరహాలోనే కేంద్రం కొనాలని తీర్మానం చేశామన్నారు. కేంద్రం తీరుపై టీఆర్ఎస్ ఎల్పీలో సుధీర్ఘ చర్చ జరిగిందన్నారు. రేపు మంత్రులు,ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్తారన్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కలుస్తారన్నారు. 30 లక్షల ఎకరాల్లో వచ్చిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు బాధ్యతను కేంద్రం తప్పించుకోవద్దన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం మెలిక పెట్టకూడదన్నారు. యాసంగి వరిని కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు. ఎమ్మెస్పీ ఇచ్చేది బియ్యానికి కాదని.. ధాన్యానికి అని అన్నారు.  ఇది రైతుల జీవన్మరణ సమస్య అని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో దేశమంతటికీ ఒకే పాలసీ ఉండాలన్నారు. బాయిల్డ్ రైస్  కొంటరా? రా రైస్ కొంటారా? కేంద్రం ఇష్టమన్నారు. తమ దగ్గర ధాన్యం తీసుకోవాలని.. ఏ రైస్ చేసుకుంటారో అది కేంద్రం బాద్యత అని అన్నారు. బియ్యం కథ, దయ్యం కథం తమకెందుకన్నారు.  కేంద్రం కొనేదాకా ఉద్యమం ఆగదన్నారు.  కేంద్రం వినకపోతే యాక్షన్ ఓరియంటెడ్ గా తమ పోరాటం ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం స్థాయిలో కేంద్రంపై  తమ పోరాటం ఉంటుందన్నారు. రైతుల కోసం ఎంతకైనా పోరాటం చేస్తామన్నారు. రాజకీయంగా కూడా సమాజాన్ని డివైడ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 

యూపీలో బీజేపీకి 50 కి పైగా సీట్లు ఎందుకు తగ్గాయో ఆలోచించాలన్నారు. యూపీలో బీజేపీ బలం తగ్గుతుందని గతంలో చెప్పానన్నారు. దేశానికి బీజేపీ ఏం చేయలేదని 8 ఏళ్ల పాలనలో తేలిపోయిందన్నారు. యూపీఏ కన్నా అధ్వానంగా బీజేపీ పాలన ఉందన్నారు. పంజాబ్ లో కూడా బీజేపీ బలం తగ్గిందన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా బీజేపీ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు.  ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేయాలని కేంద్రం చూస్తోందన్నారు. 

కాశ్మీర్ ఫైల్స్  ఓ దిక్కుమాలిన వ్యవహారం. కశ్మీర్ ఫైల్స్ పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. సినిమా కోసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సెలవులిచ్చి సినిమా చూడమని చెబుతారా అని అన్నారు. డెవలప్ మెంట్ ఫైల్స్ ఉండాలి కానీ, కశ్మీర్ ఫైల్స్ ఏంటని ప్రశ్నించారు.  ఏ రకంగా చూసినా కాశ్మీర్ ఫైల్స్, విభజన రాజకీయాలు తప్ప ఇంకేమి లేదన్నారు. కరోనా కంట్రోల్ లో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. అన్ని సూచీల్లో భారత స్థానం దిగజారిందన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై కేంద్రం స్పందించడం లేదన్నారు. బీజేపీకి ఉద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయంగా బలపడే ఆలోచన తప్ప ప్రొగ్రెసివ్ ధోరణి లేదన్నారు. 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక బ్యాంకుల స్కామ్ లు పెరిగాయన్నారు. 11 లక్షల కోట్లు బ్యాంకులు మాఫీ చేస్తాయి కానీ, ధాన్యం కొనుగోళ్లకు 11 వేల కోట్లు లేవా? అని ప్రశ్నించారు. దేశ ఆహార భద్రతను  మన రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందన్నారు.  ఆహార భద్రత బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూస్తుందన్నారు. కరువో కాటకమో వస్తే వారం రోజులు మన దేశ ప్రజలకు అన్నం పెట్టే పరిస్థితి ఏదేశానికి లేదన్నారు. దేశంలో నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు రాజ్యాంగ రక్షణ లేదన్నారు. రైతుల హక్కుల కోసం రాజ్యాంగ రక్షణ ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం దిగిపోవాల్సిందేనన్నారు. అవసరమైతే కేబినెట్ అంతా వెళ్లి ఢిల్లీలో నిరసన చేస్తామన్నారు. ఈడీ దాడులను తోకదాడులకు భయపడబోమన్నారు కేసీఆర్. ఎవరొస్తారో రాని చూద్దాం వెల్కమ్ అని అన్నారు. మోడీ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వబోమన్నారు. అనుమతి తీసుకుని విగ్రహాలు పెడితే ఎవరు వద్దంటారన్నారు.

ప్రశాంత్ కిషోర్ తనతో కలిసి పనిచేస్తున్నాడని.. తప్పేంటని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. దేశంలో పరివర్తన కోసం ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేస్తానన్నారు. ఏడేనిమిది ఏళ్ల నుంచి ప్రశాంత్ కిషోర్తో నాకు ఫ్రెండ్ షిప్ ఉందన్నారు. ప్రశాంత్ కిషోర్ డబ్బులు తీసుకుని పనిచేయబోడన్నారు. ప్రశాంత్ కిషోర్ 12 రాష్ట్రాల్లో పనిచేశాడన్నారు. జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేస్తున్నామన్నారు. ప్రశాంత్ కిషోర్ కమిట్ మెంట్ ఉన్న వ్యక్తని..మంచోడన్నారు. ఆరు నూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.గత ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడే వారికి మతిలేదని..వారికి ఏ స్థాయి లేదన్నారు. కేసీఆర్ ఎప్పుడూ మోసం చేయడని.. చెప్పిందే చేస్తడన్నారు.  ఈ సారి 95 నుంచి 105 సీట్లు పక్కా.. రాస్కోండన్నారు కేసీఆర్.