నేను మొండొన్ని.. నాతో పెట్టుకోవద్దు

నేను మొండొన్ని.. నాతో పెట్టుకోవద్దు

యాదాద్రి భువనగిరి: సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్దికోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని కోరారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ఆయన.. గ్రామస్తులందరూ కలిసి ఉండాలని కోరారు. గ్రామంలో ఎవరికి ఏ అవసరమొచ్చినా నేనున్నానని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామం కోసం గ్రామ నిధి ఏర్పాటు చేయాలన్నారు. వాసాలమర్రి కూడా ఎర్రవెల్లిలా అభివృద్ది చెందాలని ఆయన అన్నారు. వాసాలమర్రిలో మంచి కమ్యూనిటీ హాల్ కట్టాలని అన్నారు. గ్రామంలో 2000 మంది గ్రామం కోసం 5 గంటలు పనిచేస్తే ఊరు మారదా అని ఆయన ప్రశ్నించారు. తాను మొండొడినని.. తనతో పెట్టుకోవద్దని ఆయన అన్నారు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో వదిలేయనని ఆయన అన్నారు.