
ప్రధాని మోడీ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం.. ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చారన్నారు సీఎం కేసీఆర్. ఆర్టీసీకి పోటీదారిని సృష్టించమని అధికారాలు ఇచ్చారు. సెప్టెంబర్ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. మేము అదే చేస్తామన్నారు.
తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులే కాదు అందరూ పనిచేశారు. కొద్దిరోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులకు రాకుండా చూసుకుంటాం. ఆర్టీసీ సంఘాలు తక్షణం దిగిరావాలి లేదంటే ఒక్క సంతకంతో 7వేల బస్సులకు పర్మిషన్లు ఇస్తామని హెచ్చరించారు కేసీఆర్.