
హైదరాబాద్ : పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చాలా బాగా జరిగిందని తెలిపారు సీఎం కేసీఆర్. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఆర్ గెలిచిన సందర్భంగా ఆయన గురువారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ప్రజలు వందశాతం అన్నీ గమనిస్తున్నారని తెలిపారు కేసీఆర్. హుజూర్ నగర్ ఎన్నికల కోసం పని చేసిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకు ధాంక్స్ అన్నారు.
పంచాయతీ, మున్సిపాలిటీలకు ఆర్ధిక వనరులు కూడా పెంచాలన్నారు. గ్రామాభివృద్థి కోసం ఇప్పటికే గ్రామపంచాయతీ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం తెచ్చామని తెలిపిన సీఎం.. రెవెన్యూ చట్టం రావాల్సి ఉందన్నారు. గ్రామ పంచాయతీల కోసం రూ. 339 కోట్లు ప్రతి నెల మంజూరు చేస్తున్నామన్న సీఎం.. నవంబర్ లో మున్సిపల్ ఎలక్షన్స్ పూర్తి చేస్తామని తెలిపారు.