యాదాద్రిలో 10 వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం

యాదాద్రిలో 10 వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం

ఏరియల్ వ్యూ ద్వారా  యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ  పనులను పరిశీలించారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చినజీయర్ స్వామి రాసి ఇచ్చిన ముహుర్త పత్రికను స్వామివారి పాదాల దగ్గర ఉంచి, ఆలయ ఈఓ గీతకు సీఎం అందించారు.  సీఎంతో పాటు మంత్రులు, స్థానిక నేతలను శాలువా కప్పి ఆశీర్వదించారు పండితులు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పనులను పరిశీలించారు కేసీఆర్. ఇప్పటి వరకు పూర్తయిన పనుల వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. 

పెంబర్తి కళాకారులు తయారు చేసిన ప్రధానాలయ ద్వారాలను ప్రత్యేకంగా పరిశీలించారు సీఎం. ఆలయ పున:ప్రారంభానికి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆలయ పున: ప్రారంభమయ్యే అవకాశముందన్నారు. యాదాద్రిలో 10 వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం నిర్వహిస్తామని చెప్పారు. చిన జీయర్ స్వామి స్వయంగా పర్యవేక్షిస్తారని అన్నారు. వేదపండితుల ఇండ్ల స్థలాల విషయంలో ఎప్పుడో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

పంపకాల్లో తేడా.. అందుకే హరీష్,ఈటల మధ్య మాటల యుద్ధం

హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయినయ్‌