వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​కు గుణపాఠం చెప్పాలె : బీజేపీ నేతలు

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​కు గుణపాఠం చెప్పాలె : బీజేపీ నేతలు

నిజామాబాద్​ నెట్​వర్క్, వెలుగు: ​ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్​ విస్మరించారని.. వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి  బీఆర్ఎస్​కు గుణపాఠం చెప్పాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. బీజేపీ నేషనల్​ప్రెసిడెంట్ జేపీ నడ్డా నిర్వహించిన  వర్చువల్ మీటింగ్స్ ​శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగాయి.  నిజామాబాద్​అర్బన్  లోని  శ్రీరామ గార్డెన్​లో జిల్లా అధ్యక్షుడు  బస్వా లక్ష్మి నర్సయ్య, అసెంబ్లీ పాలక్ బండ కార్తీకరెడ్డి మాట్లాడారు.  రైతులకు రుణమాఫీ చేయకపోవడం వల్ల నాలుగేళ్లుగా వడ్డీ భారంతో నలిగిపోతున్నారన్నారు. ప్రబారి ధీరజ్ రెడ్డి,   యెండల లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.

బోధన్  లో కాషాయ జెండా ఎగరాలి

వచ్చే అసెంబ్లీ  ఎన్నికల్లో నియోజవర్గంలో  కాషాయజెండా ఎగరవేయాలని నియోజకవర్గ పాలక్​ యం.మల్లారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని రవి గార్డెన్​లో జరిగిన వర్చువల్​మీటింగ్​లో బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్​కుటుంబ పాలనను అంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.  బీజేపీ జిల్లా కార్యదర్శి  సుధాకర్​చారి, బోధన్​ పట్టణ అధ్యక్షుడు బాల్​రాజ్ పాల్గొన్నారు.

 రేపే ఎన్నికలు అన్నట్లు కష్టపడాలి

రేపే ఎన్నికలు అన్నట్లుగా ప్రతి బూత్​ స్థాయి కార్యకర్తల  నుంచి జాతీయ స్థాయి నాయకులు పని చేయాలని, అప్పుడే బూత్​లెవల్​లో పార్టీ బలోపేతమవుతుందని  బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ పాలక్ అప్పాల గణేశ్ చక్రవర్తి  అన్నారు. ఆర్మూర్ లో  బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పాలెపు రాజు అధ్యక్షతన నిర్వహించిన  బీజేపీ మహా సమ్మేళనానికి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 

బిచ్కుందలో 


బీజేపీ జుక్కల్​ నియోజకవర్గ స్థాయి  బూత్​ లెవల్ మహా​ మహా సమ్మేళనం  బిచ్కుందలోని  సంగాయప్ప  ఫంక్షన్​ హాల్​లో  సక్సెస్​ఫుల్​గా నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు అరుణతార , నిర్మల్​ జిల్లా ప్రభారీ రితేశ్ ​రాథోడ్​ పాల్గొన్నారు. 

ప్రభుత్వ పథకాలు మీ జేబుల నుంచి ఇస్తున్నరా?

సర్కార్​ స్కీం లను బీఆర్​ఎస్​ లీడర్ల జేబుల్లోనుంచి ఇస్తున్నారా? అని  నిజామాబాద్​ రూరల్​అసెంబ్లీ ఇన్​చార్జి  కులాచారి దినేశ్​ కుమార్​ ప్రశ్నించారు. మండల కేంద్రంలో నిర్వహించిన మహా సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.