కొత్త జిల్లాలతోనే భూముల ధరలకు రెక్కలు

కొత్త జిల్లాలతోనే భూముల ధరలకు రెక్కలు

 కొత్త జిల్లాల ఏర్పాటుతోనే రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగాయన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ఎక్కడ చూసిన ఎకరా కోటి పలుకుతుందన్నారు. మారుమూల గ్రామంలో కూడా ఎకరా రూ.25 నుంచి 30 లక్షలకు తక్కువ లేదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షలో మాట్లాడుతూ.. గతంలో ఏవరూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయలేదన్నారు. కొత్త జిల్లాలతో పరిపాలన మరింత సులభమన్నారు.  రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిలో అధికారులది కీలక పాత్ర అని అన్నారు. అధికారులందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు.  నీళ్లను పరుగెత్తించకుండా నడిపించడాన్ని వాటర్ షెడ్డింగ్ అంటారన్నారు. సమైక్య రాష్ట్రంలో నాశనం చేయబడిన చెరువులను మిషన్ కాకతీయతో అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. తెలంగాణ రాకముందు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లో ఉన్న తన ఇంట్లో పెట్టిన పేరే మిషన్ కాకతీయ అని అన్నారు. తెలంగాణ సీఎస్ కు రైతుల తరపున  ధన్యవాదాలు తెలిపారు. 2601 క్లస్లర్లను నిర్మించినటు వంటి గొప్ప వ్యక్తి చీఫ్ సెక్రటరీ అని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో  ఎక్కడా లేవన్నారు.  తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇంకా  పెరుగుతాయన్నారు. తెలంగాణలో ఒక్కో విద్యార్థికి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు పెడుతున్నామన్నారు. గత పాలకులది డైలాగు లేనన్నారు. కేంద్రంతో కొట్లాడి ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్లు పెట్టించానన్నారు. అభివృద్ధిలో దేశం కిందికి పోతుంటే ..తెలంగాణ పైకి పోతుందన్నారు. ఉద్యోగ సంఘాలతో కూర్చుని ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ను సరళించాలని సీఎస్ కు సూచించారు. రాజస్థాన్ ను తలదన్ని ఇండియాలో నంబర్ వన్ గొర్రెలను పెంచే రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల కలెక్టరేట్ భవనాలకు ఆర్కిటెక్ట్ గా  పని చేసినటువంటి భువనగిరికి చెందిన ఉషారెడ్డిని ప్రత్యేకంగా స్టేజ్ పైకి పిలిచి అభినందించారు కేసీఆర్. తెలంగాణలో అపారమైన ప్రతిభ ఉందనడానికి ఆమె నిదర్శనమన్నారు. సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరిగిందన్నారు.