సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం వదిలి ప్రైవేట్ సంస్థ యజమానిలా మాట్లాడారన్నారు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం. ప్రజల పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సామాన్య జనాలకు ఆర్టీసీ తప్ప వేరే మార్గం లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు.. ప్రజలకు అవసరమైన వ్యవస్థ అన్నారు. అన్నిపక్షాలు ఏకతాటిపైకి రావాలని, గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆర్టీసీ లేకపోతే వచ్చే నష్టాలను ప్రజలకు వివరించాలన్నారు. అసత్యాలు.. అర్ధ సత్యాలే కేసీఆర్ మాట్లాడారన్నారు. ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పపోగా.. దబాయించి మాట్లాడారన్నారు. ముఖ్యమంత్రి దుర్మార్గానికి నిన్నటి ప్రెస్ మీట్ పరాకాష్ట అన్నారు కోదండరాం.

