నేడు కాళేశ్వరానికి సీఎం

నేడు కాళేశ్వరానికి సీఎం

హైదరాబాద్, వెలుగు .సీఎం కేసీఆర్‌ గురువారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి, వచ్చే వానాకాలంలో నీటిని తరలించే అంశంపై ఇంజనీర్లతో సమీక్షించనున్నారు. ఈ మేరకు సీఎం బుధవారం రాత్రి 7.45 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి రోడ్డు మార్గంలో కరీంనగర్‌కు బయల్దేరారు. రాత్రికి కరీంనగర్‌ (తీగలగుట్టపల్లి)లోని ఉత్తర తెలంగాణ భవన్‌లో బస చేస్తారు. గురువారం ఉదయం 9 గంటలకు కరీంనగర్‌ నుంచి హెలికాప్టర్‌లో కాళేశ్వరానికి బయల్దేరుతారు. 10 గంటలకు కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని పరిశీలిస్తారు. అక్కడే ఇంజనీర్లతో నీటి లిఫ్టింగ్‌పై సమీక్షిస్తారు. లంచ్​ చేశాక హెలికాప్టర్‌లో తిరిగి కరీంనగర్‌కు చేరుకుంటారు. ఉత్తర తెలంగాణ భవన్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం హైదరాబాద్‌కు బయల్దేరుతారు. చీకటిపడే లోపే సీఎం తిరుగు ప్రయాణమైతే హెలిక్యాప్టర్‌ ద్వారా వస్తారని.. చీకటి పడితే రోడ్డు మార్గాన వస్తారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.