ఢిల్లీలో కేసీఆర్ కు పంటి చికిత్స

ఢిల్లీలో కేసీఆర్ కు పంటి చికిత్స

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్​ మంగళవారం పంటి చికిత్స చేయించుకున్నారు. పదేండ్లుగా పర్సనల్​ డెంటిస్ట్​గా ఉన్న డాక్టర్​ దగ్గరకు ఆయన వెళ్లారు. బుధవారం మరోసారి రావాల్సిందిగా డాక్టర్​ సూచించినట్టు సమాచారం. కేసీఆర్​ భార్య శోభ బుధవారం ఎయిమ్స్​లో హెల్త్​ చెకప్​ చేయించుకోనున్నారు. కొంతకాలంగా ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పోయినసారి సీఎం ఢిల్లీ టూర్​ సందర్భంగా ఆమె ఎయిమ్స్​లోనే చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్​ ఢిల్లీ పర్యటన వివరాలను సీఎంవో రహస్యంగా ఉంచింది. పర్యటనలో భాగంగా కొందరు జాతీయ నేతలు, పలు పార్టీల సీఎంలతో కేసీఆర్​ సమావేశమవుతారని ప్రచారం జరిగినా.. తొలిరోజు ఆయన ట్రీట్​మెంట్​ తీసుకున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్​ అధికారులను కూడా సీఎంవో దూరం పెట్టినట్టు సమాచారం. అధికారిక సమాచారం అయితేనే భవన్​ అధికారులకు సమాచారం ఇస్తున్నట్టు తెలుస్తోంది. గురువారం ఢిల్లీ పర్యటన ముగించుకుని కేసీఆర్​ హైదరాబాద్​ తిరుగుపయనమవుతారని అధికారులు చెప్పారు. కాగా, తమిళనాడు సీఎం స్టాలిన్​కు కేసీఆర్​ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్​లో ఆయన స్టాలిన్​తో మాట్లాడారు. కేసీఆర్​కు స్టాలిన్​ కృతజ్ఞతలు తెలిపారు.