యాదగిరి నర్సన్నను దర్శించుకున్న ముగ్గురు సీఎంలు 

యాదగిరి నర్సన్నను దర్శించుకున్న ముగ్గురు సీఎంలు 

సీఎం కేసీఆర్ యాదగరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కలసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ విశిష్టతను నేతలకు వివరించారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో యాదగిరి గుట్టకు చేరుకున్న సీఎంలకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.సీఎంతో పాటు మంత్రి తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత ఉన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ నేత డి. రాజా యాదగిరి గుట్టకు వెళ్లినా స్వామివారి దర్శనానికి మాత్రం వెళ్లలేదు. యాదగిరి గుట్ట నుంచి నేతలు ఖమ్మం సభకు వెళ్లనున్నారు. 

సీఎం కేసీఆర్ యాదగిరి గుట్ట పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 1600 మంది పోలీసులను మోహరించారు. సీఎం టూర్ కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపేశారు.