-office-in-Delhi_ZHAOBI0kmU.jpg)
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. బిజీబిజీగా గడుపుతున్నారు. సంపత్ విహార్ లో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లతో పాటు వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్ తేజను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తున్నందున అందుకు తగ్గట్టుగా భవన నిర్మాణం ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. మీటింగ్ హాళ్లు, తన చాంబర్ సహా మిగతా ఆఫీసులు ఏ విధంగా ఉండాలో సూచించారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన అనంతరం కేసీఆర్ తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన మరో 3, 4 రోజులు అక్కడే ఉండనున్నట్టు సమాచారం. పలువురు రాజకీయ ప్రముఖలతో కేసీఆర్ భేటీ కానున్నారు. మాజీ సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.