గాలి గోపురం ఇంత ఎత్తులో ఎందుకు?

V6 Velugu Posted on Oct 20, 2021

యాదాద్రి/హైదరాబాద్, వెలుగు: యాదాద్రి కొండ వైకుంఠ ద్వారం దగ్గర ఏర్పాటు చేసిన గాలి గోపురం అంత ఎత్తులో నిర్మిస్తే భక్తులు మెట్లు ఎట్ల ఎక్కగలుగుతారని ఆఫీసర్లపై సీఎం కేసీఆర్​ సీరియస్ అయ్యారు. కొండ కింద వైకుంఠ ద్వారం నుంచి పాతగుట్ట చౌరస్తాదాకా రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి.. ఇంత హైట్ ఎందుకని ఆఫీసర్లను ప్రశ్నించారు. మంగళవారం యాదాద్రిలో పర్యటించిన కేసీఆర్.. శ్రీలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పనులను పరిశీలించారు. తొలుత ఏరియల్ సర్వే చేసి, తర్వాత పెద్దగుట్ట నుంచి యాదాద్రి కొండపైకి చేరుకుని బాలాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. కొండపైన మెయిన్ టెంపుల్ లోకి వెళ్లి అక్కడే సీఎం గంటన్నర పాటు గడిపారు.

టెంపుల్​సిటీని చూసి..

మెయిన్​ టెంపుల్​లో మాడవీధులు, ఆంజనేయస్వామి టెంపుల్, శివాలయం, విష్ణు పుష్కరిణి నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. పెద్దగుట్టపై టెంపుల్ సిటీని, అక్కడే ఆశ్రమ నిర్మాణం కోసం చినజియర్ స్వామికి ఇచ్చిన రెండెకరాల స్థలాన్ని చూశారు. గండిచెరువు దిగువన భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్న పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల భవన నిర్మాణాలను పరిశీలించారు. తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్లను పరిశీలించారు. కొండపై ఏర్పాటు చేసిన లైట్లను పరిశీలించారు. గాలి గోపురం నిర్మాణం పూర్తి అయిన తర్వాత కేసీఆర్ జూన్ నెలలో యాదాద్రిని సందర్శించారు. గాలి గోపురం దగ్గర నిలబడే రోడ్డు నిర్మాణ పనులకు ఆదేశాలు ఇచ్చారు.

Tagged CM KCR, Yadadri Temple

Latest Videos

Subscribe Now

More News