
సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా సభలో గందరగోళం తలెత్తింది. భట్టి మాట్లాడుతుండగా స్పీకర్ పోచారం అడ్డు చెప్పారు. అవసరమైన దాని కంటే అధికంగా టైం తీసుకున్నారని, ఇతర సభ్యులకు అవకాశం ఇవ్వాలంటూ భట్టిని కోరారు. ఎమ్మెల్యేలు ,మంత్రులు సీఎంను కలిసి సమస్యలు చెప్పాలనుకుంటారు కానీ సీఎం కేసీఆర్ ఎందుకు కలవనివ్వరని భట్టి ప్రశ్నించారు. ఐటీఐఆర్ పై అఖిలపక్షాన్ని పిలవాలన్నారు. విశాఖ ఉక్కుపై ఆంధ్రాలో ఉద్యమం జరుగుతుందని... విశాఖ తరహాలో తెలంగాణలో బయ్యారం ఫ్యాక్టరీ కోసం ఉద్యమం చేద్దామన్నారు. సభ్యుల భలం ఉందని సర్కార్ అహంకారంతో ఉందన్నారు. భట్టి విక్రమార్క మాటలు కరెక్ట్ కాదన్నారు సీఎం కేసీఆర్. భట్టి మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. స్పీకర్ ఎలా పవర్తించాలో భట్టి చెప్పొద్దన్నారు. సభకు రావాలా వద్దా అనేది వారిష్టమన్నారు. భట్టి విక్రమార్క సీఎంపై మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. చట్ట సభల్లో ఆవేశాలు పనికిరావన్నారు.