రాష్ట్ర బీజేపీ క్యాడర్ పై పోలీసుల థర్డ్ డిగ్రీ: బండి సంజయ్

రాష్ట్ర బీజేపీ క్యాడర్ పై పోలీసుల థర్డ్ డిగ్రీ: బండి సంజయ్

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అరాచక పాలన సాగిస్తున్నారని అన్నారు బీజేపీ నాయకులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తమ పార్టీ రాష్ట్రంలో పుంజుకుంటుండటంతో కేసీఆర్ కు చెమటలు పడుతున్నాయని అన్నారు. దీంతో పోలీసులను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని అన్నారు. ఏకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెప్పారు.

సీఎం కేసీఆర్ గిమ్మిక్కులు చేసి రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో లాభం పొందాలని చూస్తున్నారని సంజయ్ అన్నారు. ఇందుకే మున్సిపల్ ఎన్నికలను ఆదరాబాదరాగా నిర్వహించాలని కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి కొంత మంది మున్సిపల్ కమీఫనర్లు కేసుల్లో ఇరుక్కున్నారని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసిన జితేందర్ రెడ్డిని టీఆర్ఎస్ మోసం చేసిందని అన్నారు బండిసంజయ్. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కరీంనగర్ లో అరాచకం సృష్టిస్తున్నారని చెప్పారు. కరీం నగర్ లో జరుగుతున్న అభివృద్ధికి నిధులు కేంద్రానివేనని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని అన్నారు.  సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చెప్పారు సంజయ్.