ఇవాళ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఇవాళ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఇవాళ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 2గంటల 15 నిమిషాలకు క్యాంప్ ఆఫీస్ నుంచి మేడ్చల్ వెళతారు సీఎం. 2గంటల 55 నిమిషాలకు మేడ్చల్ జిల్లా అంతాయిపల్లి చేరుకుంటారు. అక్కడే కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేస్తారు. 4 గంటలకు IDOC పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో మాట్లాడతారు కేసీఆర్.

సీఎం టూర్ సందర్భంగా మధ్యాహ్నం 12 నుంచి 6 గంటల వరకు అల్వాల్ ముత్యాలమ్మ ఆలయం నుంచి అంతాయిపల్లి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రకటించారు సైబరాబాద్ సీపీ. ఈ రూట్ లో బైక్ ర్యాలీ ఉన్నందున వాహనదారులు ఇతర రూట్లలో వెళ్లాలని సూచించారు.