కరోనా నుంచి కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడ్తడు: హరీశ్ రావు

కరోనా నుంచి కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడ్తడు: హరీశ్ రావు

ఎలాంటి కరోనా పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని..కంటికి రెప్పలా కాపాడుకునేందుకు తమకు కేసీఆర్ ఉండని చెప్పారు. రామగుండంలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన హరీశ్ .. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల బతుకులు మార్చే నాయకుడని అన్నారు. కేసీఆర్ దేశానికి దిక్సూచి అని కొనియాడారు.

వైద్య సేవల్లో తెలంగాణ దేశంలో మూడోస్థానంలో నిలిచిందని హరీశ్ రావు అన్నారు. అత్యధిక మంది డాక్టర్లను తయారు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని  చెప్పారు. రెండేళ్లుగా కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర ప్రగతి ఆగుతలేదన్నారు.  మళ్లీ కరోనా వస్తదంటున్నారు..కానీ ప్రజలంతా భయపడకుండా ధైర్యంగా, భరోసాతో ఉండాలన్నారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ ఉండని.. ప్రజలను  కంటికి రెప్పలా కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతుందని హరీశ్ ఆరోపించారు. ఇవాళ రైతుబంధు, మిషన్ భగీరథ వంటి రాష్ట్ర పథకాలను కేంద్రం దేశ వ్యాప్తంగా అమలు చేస్తుందన్నారు.  కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో మెచ్చుకుని రాష్ట్రంలో విమర్శలు చేస్తుందని అన్నారు.