నా ఆస్తులు పెరిగితే పంచాయతీకే ఇస్తా..బాండ్‌‌‌‌ పేపర్‌‌‌‌తో సర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ ప్రచారం

నా ఆస్తులు పెరిగితే పంచాయతీకే ఇస్తా..బాండ్‌‌‌‌ పేపర్‌‌‌‌తో సర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ ప్రచారం

వనపర్తి/పెబ్బేరు, వెలుగు : తాను సర్పంచ్‌‌‌‌గా గెలిచాక ఏమైనా ఆస్తులు సంపాదిస్తే వాటిని గ్రామ పంచాయతీకే రాసిస్తానని ఓ క్యాండిడేట్‌‌‌‌ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లికి చెందిన బి.బాలాగౌడ్‌‌‌‌ సర్పంచ్‌‌‌‌ పదవికి పోటీ చేస్తున్నాడు. ప్రచారంలో భాగంగా.. ‘నాకు గ్రామ చెరువు వెనుక 10 గుంటల భూమి ఉంది. 

నాకన్న రెండు గదుల ఇంటిలో ఒక గది ఆర్‌‌‌‌సీసీ కాగా.. మరో గది రేకుల కప్పు, నాకు ఓ మోటార్‌‌‌‌ సైకిల్‌‌‌‌ ఉంది. నేను సర్పంచ్‌‌‌‌గా గెలిచాక ప్రజలకు సేవ చేస్తాను. సర్పంచ్‌‌‌‌గా దిగిపోయే నాటికి కూడా ఇవే ఆస్తులు ఉంటాయి.. ఇంతకన్నా ఎక్కువ ఉంటే వాటిని గ్రామ పంచాయతీకే రాసిస్తా.. నాకు ఒక అవకాశం ఇవ్వండి’ అంటూ ఓ బాండ్‌‌‌‌ పేపర్‌‌‌‌పై రాసి దానిని ఓటర్లకు చూపుతూ ప్రచారం చేస్తున్నాడు.