
సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. మూడు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను ఆయన ప్రారంభించనున్నారు. జనవరి 12న మహబూబాబాద్ నూతన కలెక్టరేట్ను కేసీఆర్ ప్రారంభిస్తారు. అదేరోజు మధ్యాహ్నాం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు.
ఇక సంక్రాంతి పండుగ తరువాత జనవరి 16న ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సకల సదుపాయాలతో ఈ జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ప్రభుత్వం నిర్మించింది. ఇక మరికొన్ని జిల్లాలో సమీకృత కలెక్టరేట్ల పనులు నిర్మాణదశలో ఉన్నాయి.