నిజామాబాద్‌లో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న కేసీఆర్

నిజామాబాద్‌లో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న కేసీఆర్

ఇవాళ నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జిల్లా కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.15కు బేగంపేట్ నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 2.10 గంటలకు TRS కొత్త ఆఫీస్‌కు చేరుకుని దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 2.30కి నిజామాబాద్ కొత్త కలెక్టరేట్ బిల్డింగ్‌కు చేరుకుని 2.40కి ఆ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 3 గంటల సమయంలో గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకుని బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. 

సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన సందర్భంగా 2371 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు జన సమీకరణ కోసం నిజామాబాద్ టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లు చేసుకున్నారు. గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్ లో సీఎం సభ ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి నిన్న పరిశీలించారు.