
- రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు:
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, వేలాది సభలను నిర్వహిస్తూ, సకల జనులను సమీకరిస్తూ, సమన్వయ పరుస్తూ, అందరి భాగస్వామ్యంతో కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం యాది చేసుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో సీఎంవో తెలిపింది.
తెలంగాణ నేడు సమస్త రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నది. ‘తెలంగాణ మోడల్’ పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ వంటి పాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నరు. ఈ దిశగా దేశ ప్రజలందరి ఆదరాభిమానాలను చూరగొనడం తెలంగాణ ప్రజలు సాధించిన ఘన విజయం” అని సీఎం పేర్కొన్నారు.