నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఆమె నామినేషన్ వేశారు. 2015లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి… ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో, ఖాళీ అయిన ఈ స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది.
బుధవారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో కవిత తన నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందజేశారు. నామినేషన్ కు ముందు కవిత తన భర్తతో కలసి అత్తమామల వద్ధ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
