ఢిల్లీలో తెచ్చిన ఆర్డినెన్స్‌లు.. మిగితా రాష్ట్రాల్లోనూ తెస్తరు

ఢిల్లీలో తెచ్చిన ఆర్డినెన్స్‌లు.. మిగితా రాష్ట్రాల్లోనూ తెస్తరు
  • రాష్ట్రాలను హెచ్చరించిన సీఎం అరవింద్​ కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన స్పెషల్​ ఆర్డినెన్స్​ రానున్న రోజుల్లో మిగతా రాష్ట్రాల్లోనూ తీసుకువస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలకు ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ హెచ్చరించారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ జూన్​11న ఏర్పాటు చేసిన మహా ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఇప్పుడు ఢిల్లీపై దాడి చేస్తోందని  రానున్న రోజుల్లో మిగతా రాష్ర్టాల హక్కులను కాలరాసే మరిన్ని ఆర్డినెన్స్​లను తీసుకువస్తుందని విమర్శించారు. ఈ ఆర్డినెన్స్​తేవడం అంటే ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేకుండా పోతోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం హక్కులను కాలరాసి, కేంద్రం కనుసన్నల్లో నడిచే లెఫ్టినెంట్​ గవర్నర్​ ఆధిపత్యం చెలాయిస్తారని వ్యంగ్యస్ర్తాలు సంధించారు. 

ప్రధానిపై విమర్శలు..

ప్రధాని మోడీతో పాటు బీజేపీ టార్గెట్​గా కేజ్రీవాల్​విమర్శలు చేశారు. దేశ రాజ్యాంగాన్ని మార్చి ప్రజలను ప్రధాని మోడీ అవమానించారని, ఇన్నేళ్లలో ఇలాంటి ప్రధానిని ఎన్నడూ చూడలేదని అన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని తాను పాటించబోనని మోడీ అంటున్నారని అది ఆయన నియంతృత్వానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఆర్డినెన్స్​లని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. మోడీ నియంతృత్వానికి ముగింపు పలికే మూమెంట్​ దేశ రాజధాని నుంచే ప్రారంభించాలని పిలుపునిచ్చారు.