
పశ్చిమ బెంగాల్ సీఎం.. మాడ్రిడ్ పార్కులో జాగింగ్ చేశారు. స్మార్ట్‌వాచీ పెట్టి.. స్లిప్పర్స్‌తో.. చీరకట్టులోనే ఆమె జాగింగ్ చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్పెయిన్ వెళ్లిన ఆమె.. ఫిట్‌నెస్ గురించి తన ఇన్‌స్టాలో ఓ పోస్టు చేసింది. ఆ పోస్టులో జాగింగ్ వీడియోను అప్‌లోడ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 12 రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్, స్పెయిన్‌కు వెళ్లారు. ప్రస్తుతం స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో పర్యటిస్తున్నారు. తాజాగా అక్కడ ఆమె జాగింగ్ చేస్తూ కనిపించారు. చీర కట్టులో.. స్మార్ట్ వాచ్ ధరించి, రబ్బరు చెప్పులు వేసుకుని మరీ.. మాడ్రిడ్ పార్క్‌లో మమతా బెనర్జీ జాగింగ్ చేశారు. దీదీతో పాటు ఆ దేశానికి వెళ్లిన బృందం కూడా జాగింగ్ చేశారు.
దీదీతో పాటు ఆ దేశానికి వెళ్లిన బృందం కూడా జాగింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఉదయమే జాగింగ్ చేస్తే రోజుకు కావాల్సిన శక్తి వస్తుందని ఆమె ఆ పోస్టుకు కామెంట్ కూడా చేశారు. ఫిట్‌గా ఉంటేనే.. ఆరోగ్యంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు. చేతికి స్మార్ట్‌వాచ్ పెట్టుకుని జాగింగ్ చేసిన దీదీ.. సాధారణంగా ప్రతి రోజూ ట్రెడ్‌మిల్‌పై జాగ్ చేస్తుంటారు. స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లీగాకు చెందిన అధ్యక్షుడిని మమతా కలుసుకున్నారని సమచారం.