అలప్పుజ (కేరళ): వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీని ఒక్క ఎంపీ సీటును కూడా గెలవనివ్వబోమని ఆ రాష్ట్ర సీఎం, సీపీఐ నేత పినరయి విజయన్ అన్నారు. మతతత్వ రాజకీయాలు చేస్తున్న బీజేపీని తమ రాష్ట్రంలో పాగా వేయనివ్వబోమని స్పష్టం చేశారు. శనివారం కేరళలోని అలప్పుజలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశానికి సంఘ్ పరివార్ నుంచి ముప్పు పొంచి ఉందని, దానిని వామపక్షాలు తిప్పికొడతాయన్నారు.
ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాం. అందుకే జాతీయ స్థాయిలో యాంటీ బీజేపీ కూటమిలో చేరాం. రాష్ట్రంలోని మొత్తం 20 సీట్లలో బీజేపీని ఒక్క సీటు కూడా గెలవనివ్వం. ఈసారి ఏ నియోజకవర్గంలో కూడా కనీసం సెకండ్ ప్లేస్ కూడా దక్కదు” అని చెప్పారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓటేయడంలో అర్థంలేదని విజయన్ అన్నారు.