
- హైదరాబాద్ రప్పించండి
- సీఎం ప్రవాసీ ప్రజావాణిలో బాధితుడి తల్లిదండ్రుల వేడుకోలు
ఎల్కతుర్తి, వెలుగు: సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో తమ కొడుకు కోమాలో ఉన్నడు.. హైదరాబాద్రప్పించాలని బాధితుడి తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు గురువారం సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన లోకిని సూరయ్య కుమారుడు కృష్ణమూర్తి సౌదీ అవ్వల్ బ్యాంక్(సాబ్)లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు. జులై 23న హై బీపీతో మెదడులోని రక్తనాళాలు చిట్లి రక్తస్రావం జరగడంతో కోమాలోకి వెళ్లాడు. ప్రస్తుతం అక్కడే ఓ ప్రైవేట్ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కృష్ణమూర్తి వెంట భార్య అశ్విని ఉన్నారు. తమ కొడుకుకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ కు రప్పించాలని అతని తల్లిదండ్రులు హైదరాబాద్ ప్రజాభవన్ లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్‌మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్సుకినె సంతాజీ, మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్ ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కృష్ణమూర్తిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సౌదీలోని గ్లోబల్ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు, కరీంనగర్ కు చెందిన మహమ్మద్ జబ్బార్ తో మాట్లాడారు.