
ఇంద్రవెల్లి (ఉట్నూర్), వెలుగు: ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని తన క్యాంప్ఆఫీస్ లో ఉట్నూర్ మండలం శాంతినగర్ కాలనీకి చెందిన సరళ్ల లక్ష్మికి మంజూరైన రూ.60 వేల సీఎంఆర్ఎఫ్చెక్కును ఆమె కుటుంబసభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమాన్ని కోరే ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి బా టలు వేస్తున్నామని తెలిపారు. సిరికొండ మండలంలోని సాత్మోరి గ్రామానికి చెందిన కుమ్ర దీపక్ ఇటీవల యూజీసీ సెట్ లో పాసై పీహెచ్డీ చేసేందుకు ఎంపికయ్యాడు. అతనిది పేద కుటుంబం కావడంతో ఎమ్మెల్యే రూ.5 వేల ఆర్థికసాయం అందించారు.