రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు చుక్కా రామయ్యను ఆహ్వానించిన సీఎం రేవంత్

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు చుక్కా రామయ్యను ఆహ్వానించిన సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: జూన్‌‌ 2వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్‌‌ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్‌‌లోని నల్లకుంటలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి వేడుకలకు రావాలని కోరారు. 

అలాగే, ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. విద్యావేత్త చుక్కా రామయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌‌ రెడ్డి వెళ్లి ఆయన్ను పరామర్శించి, కుటుంబ సభ్యులను కలిశారు. కాసేపు ముచ్చటించిన తర్వాత చుక్కా రామయ్యను సత్కరించారు. రేవంత్ వెంట మహేశ్‌‌ కుమార్ గౌడ్‌‌, మల్లు రవి తదితరులు ఉన్నారు.