తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3 రాత్రి హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం బయల్దేరనుంది. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికా లోని డల్లాస్ తదితర రాష్ట్రాలలో సీఎం బృందం పర్యటించనున్నారు. వారం రోజుల పాటు అమెరికాలో పెట్టుబడల ఆకర్షణ కోసం పలు కంపెనీలతో మీటింగ్స్ ఉండనున్నాయి.
పలు కంపెనీల సీఈఓలను, పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. తిరిగి ఆగస్టు 11న సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ కు వస్తారు.
